TSRTC special buses: సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 1వ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నట్లు ఎండీ తెలిపారు.
Read also: HYD Metro: IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి 12 వరకు మెట్రో సర్వీసులు!
Saraswati Pushkaralu special buses
TSRTC special buses: ఏయే ప్రాంతాల నుంచి సర్వీసులు ఉన్నాయి?
భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుండి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని ఎండీ స్పష్టం చేశారు. అందులో భాగంగా హైదరాబాద్, నర్సంపేట, తొర్రురు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మరియు మంచిర్యాల నుండి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక సంప్రదింపు నంబర్లను కూడా సంస్థ విడుదల చేసిందన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఏసీబీ వలలో బోయిన్పల్లి మహిళా ఎస్సై: రూ. 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు

