పెట్రోల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ - BPCL మాజీ డైరెక్టర్

పెట్రోల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ - BPCL మాజీ డైరెక్టర్

వార్త

వార్త

4hr

Loading...

Petrol & Diesel Price : గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా దేశీయంగా ఇంధన ధరలు మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ డైరెక్టర్ రాజ్ కుమార్ దూబే సంచలన అంచనా వేశారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సరఫరా గొలుసులో అడ్డంకులు చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తమ అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఇప్పటికే 20% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉందని భావించామని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ధరల పెరుగుదల ఒరవడి మున్ముందు కూడా ఇలాగే కొనసాగేలా కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. వెండి మాత్రం భారీ జంప్

 Petrol Prices

ప్రభుత్వం ముందున్న 3 ఆప్షన్లు.. ఇంధన సంక్షోభంపై నిపుణుల విశ్లేషణ!

ప్రస్తుత ఇంధన సంక్షోభం మరియు పెరుగుతున్న అంతర్జాతీయ ధరల నుండి దేశాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ముందు కేవలం మూడు మార్గాలు (ఆప్షన్లు) మాత్రమే ఉన్నాయని రాజ్ కుమార్ దూబే విశ్లేషించారు. మొదటిది.. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను నేరుగా పెంచేయడం. రెండవది.. సామాన్యులపై భారం పడకుండా ఉండాలంటే, చమురు మార్కెటింగ్ కంపెనీలే (HPCL, IOCL, BPCL) ఆ నష్టాలను పూర్తిగా భరించడం. ఇక మూడవది.. కంపెనీల ఆర్థిక లోటును పూడ్చడానికి మరియు ప్రజలపై భారం పడకుండా చూడటానికి ప్రభుత్వమే తన సొంత ఖజానా నుండి నిధులను (సబ్సిడీలను) కేటాయించడం. ఈ మూడు మార్గాలలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే దేశంలో ఇంధన ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సౌందర్య ప్రియులకు గుడ్ న్యూస్.. !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha