నటి ట్విషా శర్మ అంత్యక్రియలు పూర్తి

నటి ట్విషా శర్మ అంత్యక్రియలు పూర్తి

వార్త

వార్త

4hr

Loading...

Twisha Sharma : టెలివిజన్ రంగంలో విషాదం నింపుతూ, వరకట్న వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ నటి ట్విషా శర్మ అంత్యక్రియలు ఎట్టకేలకు ముగిశాయి.

మే 12న ఆమె మరణించగా, అప్పటి నుండి ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే, దేశ అత్యున్నత వైద్య సంస్థ ‘ఎయిమ్స్’ (AIIMS) వైద్యుల పర్యవేక్షణలో ఆమె మృతదేహానికి రెండోసారి అత్యంత క్షుణ్ణంగా పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. నివేదికల అనంతరం ఎయిమ్స్ వైద్య బృందం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, భోపాల్‌లోని ప్రముఖ స్మశాన వాటిక అయిన భద్భద విశ్రమ్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు, ఆప్తులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ఆమె దహన సంస్కారాలను అధికారికంగా నిర్వహించారు.

Read Also : పెద్ది' ఈవెంట్‌లో రామ్ చరణ్ పొరపాటు.. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్!

కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దర్యాప్తు లోపాలపై సీరియస్!

ట్విషా శర్మ మృతి వెనుక కట్నపిశాచుల వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో స్థానిక పోలీసులు మరియు అధికారుల వైపు నుండి తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం జరిగాయంటూ ఆమె కుటుంబ సభ్యులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ సరిగ్గా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (SC) ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు దర్యాప్తులో ఉన్న లోపాలను గుర్తిస్తూ, సుప్రీంకోర్టు దీనిని ‘సుమోటో’ (Suo Motu)గా విచారణకు స్వీకరించడం గమనార్హం. న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకోవడం మరియు ఎయిమ్స్ వైద్యుల చేత రీ-పోస్ట్‌మార్టమ్ చేయించడంతో, త్వరలోనే ఈ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు వస్తాయని మరియు నిందితులకు కఠిన శిక్ష పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha