Arava Sridhar: రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తన రాజీనామా పత్రాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
Read also: Summer Holidays 2026: మే 31తో ముగియనున్న వేసవి సెలవులు!
Janasena MLA Arava Sridhar Resigns
వివాదాలు, విచారణ ప్రక్రియ
ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను జనసేన నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే కమిటీ నివేదిక రాకముందే, పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన శ్రీధర్ తన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే విప్ పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Arava Sridhar: రాజకీయంగా ప్రకంపనలు
ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, బయటకొచ్చిన కొన్ని ఆడియో, వీడియోలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని నాయకత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలు కూడా వైరల్ అవ్వడం పరిస్థితులను మరింత క్లిష్టతరం చేశాయి. పార్టీ క్రమశిక్షణను కాపాడటంలో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీలో క్రమశిక్షణపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

