దీర్ఘకాల పెట్టుబడులతోనే మేలు..సహనంతోనే సంపద సృష్టి..ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్

దీర్ఘకాల పెట్టుబడులతోనే మేలు..సహనంతోనే సంపద సృష్టి..ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్

V6 Velugu

V6 Velugu

23hr

Loading...

హైదరాబాద్​, వెలుగు: సరైన మ్యూచువల్ ఫండ్ లేదా పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోగానే లాభాలు రావని, తదనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేదే కీలకమని ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్స్ ​రిపోర్ట్ ​తెలిపింది.

దీని ప్రకారం.. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చూసి పెట్టుబడి పెట్టడం కంటే... దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడమే మంచిది. ఆదాయం పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ పోవాలి. ఏటా సిప్​ మొత్తాన్ని టాప్ అప్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని నిలబడాలంటే అత్యవసర నిధి తప్పనిసరి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నా సిప్​లను, ఫండ్స్‌ను మార్చకూడదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News