Razole: టెక్నాలజీతో చైన్ స్నాచర్స్ ఆటకట్టించిన రాజోలు పోలీసులు

Razole: టెక్నాలజీతో చైన్ స్నాచర్స్ ఆటకట్టించిన రాజోలు పోలీసులు

hmtv

hmtv

2hr

Loading...

Razole: టెక్నాలజీతో చైన్ స్నాచర్స్ ఆటకట్టించిన రాజోలు పోలీసులు

Razole: రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చైన్ స్పాచింగ్ కి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వి.

సురేష్ బాబు తెలిపారు.సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి బంగారం, నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈనెల 11 సోమవారం రోజున పొన్నమండ గ్రామంలో రాజోలు ఎంపీపీ కడలి శ్రీదుర్గ ఇంటికి మంచినీటికని ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఆమె ఒంటరిగా ఉండటంతో ఆమె మెడలో మూడు కాసుల బంగారు చైన్ తెంచుకుని పారిపోయారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా క్రైం బ్రాంచ్ కి వచ్చిన సమాచారం ఆధారంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక బ్యాచ్ రగ్గులు, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేందుకు జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారని, వారిలో ఇద్దరి ప్రవర్తనపై ఉన్న అనుమాంతో సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక టీం ఉత్తరప్రదేశ్ వెళ్లి దర్యాప్తు చేపట్టగా.. నయీమ్ జాగీ, మహ్మద్ సుల్తాన్ జాగీ అనువారిరువురు కలిసి ఈ దొంగతనం చేసినట్టు నిర్దారించి, అందులో నయాం జాగీ ని యూపీ లోను, రెండవ నిందితుని రాజోలు ఎస్సై మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో రాజోలు పరిసర ప్రాంతం లోను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

నిందితులు నుండి 4 గ్రాముల బంగారం, రూ.1లక్షా 75 వేలు నగదు స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరు పరచనున్ననట్లు వెల్లడించారు.నేర పరిశోధనలో ప్రతిభ కనబరిచిన క్రైం బ్రాంచ్ టీం, ఎస్సైలు,సిబ్బంది లను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. అలానే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ వ్యాపారులు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సీఐ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జున రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu