Gudur: పొలాల్లో వరి కొయ్యలు, పంట అవశేషాలు కాల్చవద్దు.. ఎస్సై గిరిధర్

Gudur: పొలాల్లో వరి కొయ్యలు, పంట అవశేషాలు కాల్చవద్దు.. ఎస్సై గిరిధర్

hmtv

hmtv

5hr

Loading...

Gudur: పొలాల్లో వరి కొయ్యలు, పంట అవశేషాలు కాల్చవద్దు.. ఎస్సై గిరిధర్

Gudur: ప్రస్తుతం కొంతమంది రైతులు పంట కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను తొలగించేందుకు చెనుల్లో మంటలు పెడుతున్నారు.

అయితే ఇలా మంటలు పెట్టడం వల్ల గాలి వేగం కారణంగా అగ్ని పక్కనున్న పొలాలకు వ్యాపించి ఇతర రైతుల పంటలు, గడ్డి మోపులు, వ్యవసాయ పరికరాలు మరియు విద్యుత్ తీగలు దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల భారీ స్థాయిలో పంట నష్టం మరియు ఆర్థిక నష్టం సంభవిస్తుంది.

అలాగే అగ్ని ప్రమాదాల వల్ల రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రామాల సమీపంలోని ఇండ్లు, పశువుల షెడ్లు మరియు చెట్లు కూడా మంటలకు గురయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెనుల్లో లేదా పంట అవశేషాల వద్ద మంటలు పెట్టవద్దు. పంట అవశేషాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించాలి. పొలాల వద్ద ఎక్కడైనా మంటలు కనిపించిన వెంటనే గ్రామస్థులకు మరియు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.ప్రతి రైతు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని తమ పంటతో పాటు ఇతర రైతుల ఆస్తులను కూడా కాపాడాలి అని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu