యంగ్ హీరో అఖిల్, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. అయితే ఈ సినిమా రాయలసీమ యాసలో సాగనుంది. ప్రధాన పాత్రల సంభాషణలు యాసలో ఉంటాయట.
అఖిల్ వాయిస్ కూడా పక్కా యాసలోనే ప్లాన్ చేశారట. టీజర్లో అఖిల్ ఒరిజినల్ వాయిస్కి దూరంగా ఉన్నా.. సినిమాలో అఖిల్ వాయిస్ లోనే యాస ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

