kumaram bheem asifabad-ఎండతో ఉక్కిరిబిక్కిరి

kumaram bheem asifabad-ఎండతో ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

1hr

Loading...

- పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

- వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు

సిఫాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): మునుపెన్నడు లేని విధంగా భానుడు భగభగ మండుతున్నాడు.

ఆదివారం జిల్లా అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలోనే జిల్లాలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలలోని రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత 15 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. వడగాలులు, ఉక్కపోతతో వృద్దులు, చిన్న పిల్లలు, మహిళలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లడం చాలి ఇబ్బందిగా మారింది. కాగా రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దహెగాం మండలం కుంచవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి)లలో 46.3 డిగ్రీలు, తిర్యాణిలో 46.1 డిగ్రీలు, రెబ్బెనలో 45.9 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 45.8 డిగ్రీలు, పెంచికలపేటలో 45.7 డిగ్రీలు, చింతలమానేపల్లిలో 45.5 డిగ్రీలు, కౌటాలలో 45.2 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగు రోజులు వేడి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండకు బయటకు వెళ్లక పోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వడదెబ్బతో ఇద్దరి మృతి

సిర్పూర్‌(టి), మే 24 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలోని పారిగాం, జక్కాపూర్‌ గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి వడదెబ్బతో మృతి చెందారు. ఎస్సై సాగర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పారిగాం గ్రామానికి చెందిన ఎల్కరి అశోక్‌(40) శనివారం పొద్దంతా తన పొలంకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి వాంతులు, విరేచనాలతో స్పృహ కోల్పోయాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి భార్య సోనీ ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే జక్కాపూర్‌ గ్రామానికి చెందిన పిప్పిరె సాయినాథ్‌(46) శనివారం గ్రామంలో ఎండలో తిరిగి సాయంత్రం ఇంటికి రాగా వాంతు లు, విరేచనాలతో అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య రేఖ ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy