ఐపీఎల్ 2026: ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026: ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

7hr

Loading...

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్ఆర్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఐ పూర్తిగా తడబడింది.

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. కాగా మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(38), శనక(29), జోఫ్రా ఆర్చర్(32), రవీంద్ర జడేజా(19*) రాణించారు. ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ(0), ర్యాన్ రికెల్టన్(12), నమన్ ధీర్(6), తిలక్ వర్మ(3) నిరాశపర్చారు. సూర్యకుమార్ యాదవ్(60) హాఫ్ సెంచరీ చేసినా ముంబైకి ఓటమి తప్పలేదు. విల్ జాక్స్(33), హార్దిక్ పాండ్య(34) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. బర్గర్ 2, బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్ పుంజా 2 వికెట్లు పడగొట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy