ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

7hr

Loading...

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్..

ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా ఈ సీజన్‌లో ఇదే ఆఖరి లీగ్ స్టేజ్ మ్యాచ్. కేకేఆర్ 13 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ మ్యాచ్ వాంఖడేలో జరుగుతోంది. ఆ పోరులో ఆర్ఆర్ ఓడితే.. కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అదీనూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఆర్ఆర్ గెలిస్తే.. పంజాబ్ సహా కేకేఆర్‌ కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి.

కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), మనీశ్ పాండే, తేజస్వి దాహియా(వికెట్ కీపర్), గ్రీన్, పొవెల్, రింకు సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబె, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఫిన్ అలెన్, రంజన్, వైభవ్ అరోరా, రమన్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు

అక్షర్ పటేల్(కెప్టెన్), అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సాహిల్ ఫరాఖ్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ, మాధవ్ తివారి, ఆకిబ్ నబీ దార్, స్టార్క్, లుంగి ఎంగిడి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: త్రిపురణ విజయ్, సమీర్ రిజ్వి, విప్రజ్ నిగమ్, నితీశ్ రాణా, కుల్‌దీప్ యాదవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy